![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సింగర్ శ్రీతేజ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇక శ్రీముఖి ఐతే రాజమండ్రి యాసలో మాట్లాడొచ్చు కదా అనేసరికి ఆ యాస ఉంటే అదే వచ్చేస్తుంది అని చెప్పాడు. ఎం చేస్తుంటారు, ఏదన్న మూవీస్ లో పాడావా అని అభిజిత్, బిందు మాధవి అడిగారు. తానొక ప్లే బ్యాక్ సింగర్ అని చాలా మూవీస్ లో పాడానని ఐతే తన పేరు ఎండ్ టైటిల్ కార్డ్స్ లో ఉంది కానీ మెయిన్ టైటిల్ కార్డ్స్ లో లేదు అని చెప్పాడు. ఇక అతని సింగింగ్ టాలెంట్ చూద్దాం అని శ్రీముఖి అనేసరికి నాగార్జున నటించిన గీతాంజలి మూవీలోని ఒక సాంగ్ పాడాడు. ఇక బిగ్ బాస్ ఎందుకు అన్న శ్రీముఖి ప్రశ్నకు "నేనేమి అనుకుంటున్నాను అంటే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు వచ్చినా గట్టిగా మాట్లాడేవాళ్ళు వచ్చినా ముందు నేను వాళ్ళను కామ్ చేయగలను మంచిగా మాట్లాడగలను.

నేను అంత గట్టిగట్టిగా మాట్లాడలేదు. నేను చాలా నెమ్మదిగా మాట్లాడేవాడిని." అని చెప్పాడు. ఇక జడ్జ్మెంట్ విషయానికి వస్తే "ఇలాంటి ప్లాట్ఫార్మ్స్ మీకు చాలా వున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి పంపడానికి ఇంకా డిఫరెంట్ గా నాకేమీ కనిపించలేదు..ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి రండి " అంటూ నవదీప్, బిందు మాధవి కలిసి రెడ్ ఇచ్చారు. "మీ స్కిల్స్ వైజ్ సిట్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయగలరు అనేదే మీరు ప్రూవ్ చేసుకోవాలి అదొక్కటే మైండ్ లో పెట్టుకుని మీకు గ్రీన్ ఇస్తున్నా" అన్నాడు అభిజిత్. ఇక శ్రీతేజని పంపించేసేటప్పుడు కొంచెం ఏవన్నా వయలెంట్ సినిమాలు చూడు అంటూ శ్రీముఖి సలహా ఇచ్చింది.
![]() |
![]() |